కానీ కాలం….
అసందర్భ ప్రేలాపుల
అసాధారణ ప్రజ్ఞా పాటవాలు
వికట కవుల పాండిత్యాలలో
మరుగుపడుతున్న కవిసార్వభౌములు
రామరాజ్యంలో అశేష రావణ బ్రహ్మలు
నాయకులు లేని కథలు,
నీతి లేని నేతలు
ఆలోచించి అధమమౌతున్న తర్కవేత్తలు
బరువుకు తప్ప పనికిరాని భారీ కాయాలు
నలుగుతూ నడుస్తున్నాను
విషవలయాలు దాటుతున్నాను
గరళమొక్కసారి మింగే దేవుడైన శివుడికి
క్షణక్షణం గరళం సేవిస్తూ పోటీనిస్తున్నాను.