అమ్మ…

నీ రుధిరం
నీ ప్రాణం
ఈ జీవితం
ఈ దేహం

నీ కూరుపు
నీ ఓరుపు
నీ శ్వాస
నీ బాస

కత్తి కాచి
 వేదనోర్చి
వెసలు దీర్చి
నన్ను కూర్చి

కానరాని దైవాన్ని
కణ కణానా దాచుకుని
చరిస్తున్న దేవతవి
మా దిక్కు వి

మా అమ్మ వి